: దేశ తొలి స్మార్ సిటీ ఢిల్లీయే అవుతుంది: వెంకయ్యనాయుడు
దేశ రాజధాని ఢిల్లీ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందితే... దేశంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించిన తొలి స్మార్ట్ సిటీగా కూడా అవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. "ఢిల్లీని నిజమైన ప్రపంచ నగరంగా చేయాలని మేం కోరుకుంటున్నాం. లండన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి గ్లోబల్ సిటీల్లో ఉన్న అన్ని నూతన, ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్న నగరంగా చేయాలి. డిస్నీలాండ్, యూనివర్సల్ స్టూడియోల వంటి ప్రపంచస్థాయి వేదికలు కూడా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం" అని వెంకయ్య చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్లాన్ చేసిన వంద స్మార్ట్ సిటీల్లో, మొదటిది దేశ రాజధాని నుంచే వస్తుందన్నారు.