: అమెరికాలో బాలగోపాల్ అనే తెలుగు వ్యక్తి దారుణ హత్య


కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాలగోపాల్ అనే వ్యక్తి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. బాలగోపాల్ అక్కడ సౌత్ కరోలినా రాష్ట్రం మైథేల్ బీచ్ లో గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నాడు. అక్కడికి దొంగతనానికి వచ్చిన కొంతమంది నల్లజాతీయులు డబ్బు డిమాండ్ చేశారు. అడిగిన వెంటనే డబ్బులిచ్చినప్పటికీ తిరిగివెళుతున్న సమయంలో దుండగులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. బాలగోపాల్ మృతదేహాన్ని ఎలాగైనా స్వస్థలానికి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు.

  • Loading...

More Telugu News