: చంద్రబాబు విజన్ 2020 అంటే ప్రజలు 420 అనుకున్నారు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల
గతంలో చంద్రబాబు నాయుడు 'విజన్ 2020' అంటే ప్రజలు ఆయనను '420' అని అనుకున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత గువ్వల బాలరాజు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై చేస్తున్న కుట్రలు తక్షణం ఆపాలని ఆయన అన్నారు. తెలంగాణలోని తెలుగుదేశం నేతలు వాస్తవాలు తెలుసుకొని, చంద్రబాబుకు వత్తాసు పలకడం ఆపాలని కోరారు. నిజాంను సీఎం కేసీఆర్ ఎందుకు పొగిడారో వివరణ ఇవ్వాలన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మంచి పనులు చేసిన వారిని పొగడటం తప్పుకాదని చెప్పారు. ఇదే సమయంలో, నిజాంపై పొగడ్తలకు, కంటోన్మెంట్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేయడం కొసమెరుపు.