: ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఈ సాయంత్రం గవర్నర్ భేటీ


ఎంసెట్ పరీక్ష వివాదం మరింత ముదరడంతో కొలిక్కి తెచ్చేందుకు గవర్నర్ నరసింహన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డిలను రాజ్ భవన్ కు రావాలని పిలిచారు. సాయంత్రం 6.30లకు గవర్నర్ వారితో భేటీ కానున్నారు. ఎంసెట్ విధానంపై చర్చించి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు గవర్నర్ వారితో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ఎంసెట్ పై కోర్టుకు వెళతామని ఈ మధ్యాహ్నం ఏపీ మంత్రి గంటా తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News