: అబ్బే.. అది మా బోటు కాదు: పాక్
కేతి బందర్ పోర్టు నుంచి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన బోటు తమ దేశానికి చెందినది కాదని పాక్ విదేశాంగ శాఖ అంటోంది. ఈ మేరకు భారత్ ఆరోపణలను కొట్టిపారేసింది. దీనిపై పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నీమ్ అస్లామ్ మాట్లాడుతూ, కేతి బందర్ నుంచి ఏ బోటు కూడా భారత జలాల్లోకి ప్రవేశించలేదన్నారు. పాక్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే భారత్ ఇలాంటి ప్రచారానికి పూనుకుందని పాక్ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ 31 రాత్రి పోరు బందర్ సమీపంలో పాక్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ వేటాడగా, ఆ బోటులోని వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆ బోటులో పేలుడు పదార్థాలు ఉన్నాయని, వారు ఉగ్రవాదులని నిఘా సంస్థలు భావిస్తున్నాయి.