: కొలిక్కి వచ్చిన విమానం వెతుకులాట... 90 మీటర్ల లోతున ప్రధాన భాగాలు


జావా సముద్రంలో మునిగిపోయిన ఎయిర్ఏషియా విమానం వెతుకులాట ఓ కొలిక్కి వచ్చింది. సముద్ర గర్భంలో సుమారు 90 మీటర్ల లోతున రెండు పెద్ద వస్తువులను కనుగొన్నామని, అవి విమానం ప్రధాన భాగాలుగా భావిస్తున్నామని ఇండోనేషియా జాతీయ గాలింపు, సహాయ చర్యల సంస్థ అధినేత హెన్రీ బ్యాంబాంగ్ నేడు తెలిపారు. ఆ ప్రాంతంలో విమాన ఇంధనం తాలూకు చమురు తెట్టు కూడా కనిపించిందని వివరించారు. తాము గుర్తించిన వస్తువుల్లో ఒకటి 9.4 మీటర్ల పొడవు, మరొకటి 7.2 మీటర్ల పొడవు ఉన్నట్టు తెలిపారు. వీటిని మరింత దగ్గరగా పరిశీలించేందుకు రిమోట్ ఆధారంగా పనిచేసే వాహనాన్ని వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే నేడు ఆ భాగాలను పైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెడతామని బ్యాంబాంగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News