: ఈ నెల 9న విజయవాడ రానున్న బీజేపీ చీఫ్


బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నెల 9న విజయవాడ వస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. షా పదాధికారులతో సమావేశమవుతారని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమీక్షిస్తారని హరిబాబు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే వారి ప్రణాళికలు ఫలించాయి. ఓ రకంగా బీజేపీ ఇప్పుడు స్థానిక పార్టీలకు పెను ముప్పులా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News