: కోడిపందేలపై సుప్రీంలో బీజేపీ నేత పిటిషన్
తెలుగు రాష్ట్రాల్లో జరిగే కోడిపందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోడిపందేలు నిలిపివేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంపై ఈ మేరకు సవాల్ చేశారు. ఈ తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆచారమని, కేవలం సంక్రాంతి పండుగ సమయంలోని ఇవి ఉంటాయని, వాటిని అడ్డుకోవటం సరికాదని రాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.