: వరుడు కావాలంటూ ఎన్ఆర్ఐకి టోకరా... విచారిస్తుండగా ఆత్మహత్యాయత్నం
వెబ్ సైట్లలో వరుడు కావాలంటూ ప్రకటనలు ఇచ్చి ఓ ప్రవాస భారతీయుడిని మోసం చేసిన మాళవిక అనే యువతి సీసీఎస్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. నిజానిజాలు రాబట్టేందుకు ఆ యువతిని తీసుకువచ్చి ప్రశ్నిస్తుండగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా, ఆమె విషం తాగినట్లు వైద్యులు స్పష్టం చేశారు. పోలీసులు మాత్రం విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్కు వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు సీసీఎస్ డీసీపీ పాలరాజు వివరించారు. ఒక ఎన్ఆర్ఐని మోసం చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను విచారణకు పిలిచినట్లు పేర్కొన్నారు.