: విమాన శకలాల్లోంచి నడుచుకుంటూ వచ్చిన బాలిక
అమెరికాలోని కెంటకీలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం ఈ పీఏ-34 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. ఇంజిన్లో సమస్య కారణంగానే విమానం కెంటకీ సరస్సు వద్ద అటవీ ప్రాంతంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవగా, ఏడేళ్ల బాలిక శకలాల్లోంచి నడుచుకుంటూ వెలుపలికి వచ్చింది. ప్రమాదం గురించి స్థానికులకు తెలిపింది. షాక్ కు గురైన ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక స్వల్పంగానే గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రెండు గంటల అనంతరం సహాయక బృందాలు ఘటనస్థలికి చేరుకుని మృతదేహాలను గుర్తించాయి.