: 'పీకే' చిత్రంపై స్వామి అగ్నివేశ్ స్పందన
అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ స్పందించారు. సినిమా చూడకుండానే, ఏవో తుచ్ఛమైన కారణాలతో దాన్ని నిషేధించాలనడం సరికాదని అన్నారు. 'పీకే' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఈ ఆర్య సమాజ్ నేత అన్నారు. ఇది ఏ మతానికి వ్యతిరేకంగా రూపొందిన సినిమా కాదని స్పష్టం చేశారు. కాగా, పీకే ఇప్పటివరకు రూ.278.52 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది