: ధోనీ అక్కడ... సెలక్టర్లు ఇక్కడ!


వరల్డ్ కప్ సమీపిస్తోంది. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనే జట్లన్నీ ఆటగాళ్ల వడపోత కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. బీసీసీఐ కూడా ఈ నెల 6న టీమిండియాను ఎంపిక చేయనుంది. వన్డే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాలోనే ఉండడంతో, సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు. అందుకే అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జట్టు ఎంపిక ప్రక్రియలో పాలుపంచుకోనున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నా, బీసీసీఐ అధిష్ఠానం మద్దతు ధోనీకి పుష్కలంగా ఉన్నట్టు క్రికెట్ పండితుల అభిప్రాయం. వరల్డ్ కప్ కు జట్టు ఎంపికలోనూ ధోనీ మాటే చెల్లుబాటు అవుతుందని వారు చెబుతున్నారు. మెల్బోర్న్ టెస్టు అనంతరం ఐదు రోజుల ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ జార్ఖండ్ డైనమైట్ సిరీస్ లో చివరి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియాలోనే ఉండనున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం జరిగే ముక్కోణపు సిరీస్ లో టీమిండియాకు సారథ్యం వహిస్తాడు.

  • Loading...

More Telugu News