: అమితాబ్, ఇళయరాజా ఇద్దరూ చిన్నపిల్లలేనట!


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఇద్దరూ చిన్న పిల్లల్లాంటి వాళ్లేనని 'షమితాబ్' సినిమా దర్శకుడు ఆర్.బాల్కీ అన్నారు. అమితాబ్ 'పా' సినిమా దర్శకుడు బాల్కీ కావడం విశేషం. భారతీయ సినీ వ్యవస్థలో అత్యంత గొప్ప కళాకారులతో కలసి ప్రయాణం చేయడం తన అదృష్టమని బాల్కీ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో వీళ్లిద్దరితో పనిచేశానని ఆయన తెలిపారు. ఆ ఇద్దరికీ సరిగ్గా 73 ఏళ్ల వయసే ఉంటుందని, కానీ రికార్డింగ్ రూంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ చిన్న పిల్లల్లా చాలా ఉద్వేగానికి గురవుతారని బాల్కీ చెప్పారు. పిల్లలను ఏదైనా బొమ్మల దుకాణంలో వదిలేస్తే ఎంత ఆనందంగా ఉంటారో, రికార్డింగ్ రూంలో వదిలేసినప్పుడు కూడా వీళ్లిద్దరూ అంతే, ఉద్వేగంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ వయసులో వాళ్ల ఉత్సుకత అంతలా ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని బాల్కీ తెలిపారు.

  • Loading...

More Telugu News