: న్యూ ఇయర్ కి అక్కడ వారే సెలబ్రిటీలు!


నూతన సంవత్సర వేడుకలంటే సెలబ్రిటీల హంగామా... మందు, విందు, చిందులు. అయితే, దేశం మొత్తానికి సందేశం ఇచ్చేలా ఆదిలాబాద్ జిల్లాలోని పూనగూడ గ్రామీణులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అక్కడ కూడా మద్యం ఏరులైపారింది. ఆట, పాట, విందు, చిందు జరిగింది. అయితే అక్కడ సెలబ్రిటీలను సన్మానించారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అంత మారుమూల గ్రామానికి వచ్చిన సెలబ్రిటీలే ప్రత్యేకత! పూనగూడ గ్రామానికి రోజూ ఒకే బస్సు సౌకర్యం ఉంది. బాహ్య ప్రపంచంతో పూనగూడ గ్రామాన్ని కలిపే ఏకైక సాధనం ఆ బస్సు. అందుకే ఆ గ్రామీణులకు ఆ బస్సన్నా, ఆ బస్సులో విధులు నిర్వర్తించే డ్రైవరన్నా, కండక్టరన్నా అంతులేని అభిమానం. అందుకే ఆ బస్సు డ్రైవర్ అంజయ్య, కండక్టర్ అశోక్ కుమార్ ఇద్దరినీ సెలబ్రిటీలుగా ఆహ్వానించి సన్మానం చేశారు. అందంగా అలంకరించి బస్సుపై అభిమానం చాటుకున్నారు.

  • Loading...

More Telugu News