: ఈ పేరు మార్పు కేవలం నెహ్రూని కించపరచడానికే!: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్


ప్లానింగ్ కమీషన్ పేరు మార్చడంపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ట్విట్టర్లో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్లానింగ్ కమిషన్ పేరు మార్చడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ పేరు మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఓ చౌకబారు గిమ్మిక్కుగా ఆయన అభివర్ణించారు. ఆధునిక భారతదేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూని కించపరచే ఉద్దేశ్యంతోనే ప్లానింగ్ కమిషన్ పేరు మారుస్తున్నారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News