: పీడీపీ, ఎన్సీతో బీజేపీ చర్చలు చేస్తూనే ఉంది: అమిత్ షా


జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ, ఎన్సీ పార్టీలతో బీజేపీ చర్చలు జరుపుతూనే ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. అయితే వారి నుంచి ఇంకా ఎలాంటి ఫలప్రదమైన ఫలితాలు రాలేదన్నారు. జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసిన బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలని అడిగారు. ఈ నెల 19 వరకు గవర్నర్ డెడ్ లైన్ విధించారు. ఈ లోగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని బీజేపీ కూడగట్టుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News