: బీజేపీ పాలనలో ఆనందపడేంత సీన్ లేదు: లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈసారి దేశం గురించి సంతోషపడటానికి బీజేపీ పాలనలో అంతగా చేసిందేమీ లేదని విమర్శించారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే అప్పటికే పార్టీ పతనం మొదలైందన్నారు. బీజేపీ కాషాయ జెండా స్థానంలో త్రివర్ణ పతాకం (కాంగ్రెస్) ఎగిరే రోజు దగ్గరలోనే ఉందని లాలూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ లాలూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.