: పశ్చిమ బెంగాల్ మంత్రి బెయిల్ పిటిషన్ తిరస్కరణ


పశ్చిమ బెంగాల్ మంత్రి మదన్ మిత్రా బెయిల్ పిటిషన్ ను కోల్ కతాలోని అలీపూర్ కోర్టు నాలుగవసారి తిరస్కరించింది. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో ఈ నెల 16 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. శారదా చిట్ ఫండ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిత్రాను కుట్ర, నిధుల దుర్వినియోగం అభియోగాల కింద గతేడాది డిసెంబర్ 12న సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News