: పిల్లలకు విషమిచ్చి... ఉరేసుకున్న మహిళ
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విజయనగరం ఎస్వీఎన్ నగర్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త మృతితో మనస్తాపం చెందిన మహిళ పిల్లలు సహా ఆత్మహత్య కు పాల్పడినట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.