: పాక్ బోటులో భారీగా పేలుడు పదార్థాలు!
పాకిస్థాన్ కు చెందిన బోటు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ బోటు డిసెంబర్ 31 రాత్రి గుజరాత్ తీరంలో పోరుబందర్ పోర్టుకు సమీపంలోకి రాగా, కోస్ట్ గార్డ్ దళాలు దాన్ని వెంబడించడం, ఆపై బోటులోని వ్యక్తులు తమను తాము పేల్చుకోవడం తెలిసిందే. ఈ విషయాలను నేడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, బోటులో భారీగా పేలుడు పదార్థాలున్నాయని, అందులోని వ్యక్తులు ఉగ్రవాదులని తెలుస్తోంది. భారత్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకే ఈ ప్రయత్నమని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అటు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెలలో భారత్ రానున్నారు. తాజా ఘటన నేపథ్యంలో, ఒబామా పర్యటనపై ఆందోళన నెలకొంది.