: రాష్ట్ర విభజనకు ఆ రెండు పార్టీలే కారణం: సి.రామచంద్రయ్య
ఏపీ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య టీడీపీ, బీజేపీలపై మండిపడ్డారు. ఆ రెండు పార్టీలే రాష్ట్ర విభజనకు కారణమని ఆరోపించారు. కడపలో ఆయన మాట్లాడుతూ, విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో అందరూ సహకరించిన వారేనని, ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ ను తప్పుబట్టడం సరికాదనీ అన్నారు. తప్పుడు ప్రచారం కట్టిపెట్టి రాజధాని నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఈ మాజీ మంత్రి హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు.