: జమ్మూ కాశ్మీర్ లోకి తీవ్రవాదులను పంపేందుకు పాక్ ప్రయత్నిస్తోంది: రాజ్ నాథ్


పొరుగు దేశం పాకిస్థాన్ జమ్మూకాశ్మీర్ లోకి తీవ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. అంతేగాక, సరిహద్దు వెంబడి నిరంతరం కాల్పులకు పాల్పడుతూ, ఆ కాల్పుల మాటున తీవ్రవాదులను భారత్ లోకి పంపాలని చూస్తోందని వివరించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు దన్నుగానే పాక్ కాల్పులు జరుపుతోందా? అని విలేకరులు ఆయనను ప్రశ్నించగా, ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి పేర్కొన్నారు. జమ్మూ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ జవాన్లు దీటైన సమాధానం ఇస్తున్నారని రాజ్ నాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News