: భారత జలాల్లో సూపర్ ఛేజ్... తమను తాము పేల్చుకున్న పాక్ జాతీయులు!


పాకిస్థాన్ కు చెందినదిగా భావిస్తున్న ఓ బోటు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఈ బోటును గుజరాత్ లోని పోరుబందర్ తీరంలో ఉన్న కోస్ట్ గార్డ్ దళాలు గుర్తించి వెంటనే రంగంలోకి దిగాయి. దాదాపు గంటసేపు ఆ బోటును వెంబడించాయి. ఇంతలో, ఆ బోటులోని వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆ బోటులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు భావిస్తున్నారు. 26/11 దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ తదితరులు సముద్ర మార్గం ద్వారానే భారత్ లో ప్రవేశించడం తెలిసిందే. భారత్ చరిత్రలో దారుణం అనదగ్గ ఆనాటి దాడిలో 166 మంది విగతులయ్యారు.

  • Loading...

More Telugu News