: ఎయిర్ఏషియా విమానం కూలిన ప్రాంతం గుర్తింపు


జావా సముద్రంలో ఎయిర్ఏషియా విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే గాలింపు జరుపుతున్నామని ఇండోనేషియా నేవీ చీఫ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగతా వాటి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, శుక్రవారం ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సింగపూర్, మలేషియా, దక్షిణకొరియా, అమెరికా దేశాలకు చెందిన 90కి పైగా నౌకలు, పెద్ద సంఖ్యలో విమానాలు గాలింపులో పాలుపంచుకుంటున్నాయి. కూలిపోయిన విమానంలో 162 మంది ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News