: ఏపీలో వివిధ ప్రాంతాల్లో రిటైల్ జోన్లు: చంద్రబాబు
ఏపీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ జోన్ల ఏర్పాటుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కొత్త రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయడానికి కావలసిన అనుమతులను మంజూరు చేయడానికి సింగిల్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రిలయన్స్, క్రోమా, వాల్ మార్ట్, లైఫ్ స్టైల్ సంస్థల ప్రతినిధులు ఈ రోజు చంద్రబాబును కలిశారు. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పై వివరాలను వెల్లడించారు. డ్వాక్రా ఉత్పత్తుల నాణ్యత, అమ్మకాలను రిటెయిలర్స్ కు అప్పగిస్తామని చెప్పారు.