: టీమిండియా కొత్త కోచ్ గా నేనా!: హసీ


టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగుస్తుండడంతో మహేంద్ర సింగ్ ధోనీ కొత్త కోచ్ అంశం తెరపైకి తెచ్చాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ హసీ అయితే భారత జట్టు కోచ్ గా రాణిస్తాడని ధోనీ పేర్కొన్నాడంటూ పలు పత్రికలు ప్రచురించాయి. వీటిపై హసీ స్పందించాడు. కోచ్ పదవిని చేపట్టేందుకు తన సన్నద్ధతపై ఏమీ చెప్పలేనన్నాడు. "థాంక్స్, ఎంఎస్ (ధోనీ). ఒకవేళ ధోనీ అలా అని ఉంటే... నేనిప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాను కదా" అని వ్యాఖ్యానించాడు. హసీ ప్రస్తుతం ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News