: భారత్ వచ్చే ఒబామాకు మైసూర్ సిల్క్ శాలువతో సన్మానం
ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ కు రానున్నారు. ఈ సందర్భంగా మైసూర్ సిల్క్ శాలువతో ఒబామాను రాష్ట్రపతి సన్మానించనున్నారు. ఆయనతో పాటు వచ్చిన బృందాన్ని కూడా శాలువాలతో సన్మానిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ నుంచి 50 సిల్క్ శాలువాలకు ఆర్డర్ వచ్చిందని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ డి.బసవరాజు తెలిపారు. కొన్నేళ్ల నుంచి రాష్ట్రపతి భవన్ కు మైసూర్ నుంచే భారీగా శాలువాలు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో మైసూర్ సిల్క్ శాలువాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఒబామా భారత్ లో పర్యటించనున్నారు.