: మెట్రో రైలు సేవల్లో అంతరాయం... విధ్వంసానికి దిగిన ముంబైకర్లు
మెట్రో రైలు సేవల్లో నెలకొన్న స్వల్ప అంతరాయాన్ని కూడా ముంబైకర్లు ఓర్చుకునేలా లేరు. ఎందుకంటే, ముంబైలో సర్కారీ ఉద్యోగుల దగ్గర నుంచి సామాన్యుల వరకు రవాణాకు అదే ఆదారం మరి. నేటి ఉదయం మెట్రో రైలు సేవల్లో నెలకొన్న చిన్నపాటి అంతరాయంతో ముంబైవాసులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలనే తేడా లేకుండా కంటికి కనిపించిన వాహనాలపై దాడికి దిగారు. వాహనాలపై రాళ్లు రువ్విన ముంబైకర్లు అప్పటికీ ఆగ్రహం చల్లారక పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఆందోళనల్లో 15 వాహనాల దాకా అగ్నికి ఆహుతయ్యాయి. థాకుర్లీ స్టేషన్ వద్ద ఓ రైలులో తలెత్తిన సాంకేతిక కారణంతో మిగిలిన రైళ్లన్నీ అరగంట పాటు ఆలస్యంగా నడిచాయి. ఈ మాత్రం ఆలస్యాన్నే ముంబైకర్లు జీర్ణించుకోలేకపోయారు.