: ఏపీ రాజధాని భూ సమీకరణకు నేలపాడు రైతుల సంపూర్ణ మద్దతు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. నేటి ఉదయం తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో చేపట్టిన భూ సమీకరణకు గ్రామంలోని రైతులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అంతేకాక రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అప్పగించేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి నారాయణ రైతులను అభినందించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News