: రైట్ సోదరుల కంటే మనవాళ్లే ముందు ఎగిరారా?


విమానం కనుగొన్నది రైట్ సోదరులని మనం చదువుకున్నాం. అయితే, వారి కంటే ముందే భారతీయులు గగనవిహారం చేశారని కెప్టెన్ ఆనంద్ బోదాస్, అమేయ జాదవ్ అనే పరిశోధకులు అంటున్నారు. ఈ మేరకు వీరు తమ పరిశోధన పత్రాన్ని జనవరి 4న జరిగే 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో సమర్పించనున్నారు. ప్రాచీన కాలంలో భరద్వాజ మహాముని రూపొందించిన విమానయాన సిద్ధాంతాల ఆధారంగా రూపొందిన విమానంలో శివ్ కర్ బాపూజీ తల్పడే 1895లో గాల్లోకెగిరారని వారు తమ పత్రంలో పేర్కొన్నారు. రైట్ సోదరుల కంటే ఎనిమిదేళ్ల ముందే తల్పడే చౌపట్టీ ప్రాంతంలో వాయువిహారం చేశారని వివరించారు. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఎగిరే యంత్రాల గురించి ఎన్నో వర్ణనలు ఉన్నాయని, అవే విమానాలని ఈ పత్రంలో పొందుపరిచారు. మునులు, పరిశోధకులు అయిన అగస్త్యుడు, భరద్వాజ విమాన నిర్మాణ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు. కాగా, ముంబైలో ఆదివారం జరిగే ఈ సైన్స్ కాంగ్రెస్ ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News