: ఆస్ట్రేలియాలో అనుష్క, కోహ్లీల న్యూ ఇయర్
ప్రేమపక్షులు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు కొత్త ఏడాది 2015కు ఆస్ట్రేలియాలో స్వాగతం పలికారు.'పీకే' విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న అనుష్క ఇటీవలే తన క్రికెటర్ బాయ్ ఫ్రెండ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. అటు టెస్టు సిరీస్ కోసం కోహ్లీ కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో నూతన సంవత్సరంనాడు అక్కడి డార్లింగ్ సిడ్నీ హార్బర్ వద్ద ఓ ఫ్రెండ్ తో వారిద్దరూ కలసి వెళుతుండగా ఫొటోకు చిక్కారు. చాలా ప్రశాంతంగా, క్యాజువల్ డ్రెస్ లో స్థానిక రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది.