: బీసీసీఐ వార్షిక నివేదిక కవర్ పేజీపై రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు


86 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా బీసీసీఐ, తన వార్షిక నివేదికపై భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలను ముద్రించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ కూడా మారకతప్పడం లేదని ఈ ఘటన నిరూపిస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు భారతరత్న పురస్కారాన్ని అందజేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రాన్ని ఎంపిక చేసుకున్న బీసీసీఐ, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ చిత్రాన్ని తన నివేదిక కవర్ పేజీపై ముద్రించింది. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మే 26కు రెండు రోజుల ముందు వరకూ మోదీ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ప్రధానిగా ఎంపికైన నేపథ్యంలో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. పలు అంశాల్లో చుట్టుముట్టిన కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు విమర్శలు ఎక్కుపెట్టినా, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని మరికొందరు వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News