: లఖ్వీ బెయిల్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: పాక్
2008 ముంబయి పేలుళ్ల ప్రధాన కారకుడు జకీర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పాకిస్థాన్ అంటోంది. "ఈ కేసు చట్టపరమైంది. అయితే లఖ్వీ బెయిల్ పై అవసరంలేని హైప్ సృష్టించడం దురదృష్టకరం. ఇవన్నీ న్యాయపరమైన విషయాలు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఎలాంటి ప్రయోజనం చేకూర్చవు. కేసులో ఏం తేలుతుందో మేం ఎదురుచూస్తాం. కేసు ప్రక్రియ బాగా జరుగుతోంది" అని పాక్ విదేశీ కార్యాలయ అధికార ప్రతినిధి తస్నిం అస్లాం తెలిపారు. కాగా, సంఝౌతా ఎక్స్ ప్రెస్ కేసులో దర్యాప్తు విషయాలను తమతో పంచుకోలేదంటూ భారత్ పై ఆరోపణలు చేశారు.