: లంగర్ హౌస్ చోరుల పట్టివేత... రూ.కోటి ఆభరణాల స్వాధీనం


హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.కోటి విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగానే లంగర్ హౌస్ లోని సాలార్ జంగ్ కాలనీకి చెందిన ప్రముఖ వ్యాపారి సుమిత్ అగర్వాల్ నివాసంలో చొరబడిన దొంగలు సుమారు రూ. కోటి విలువ చేసే వజ్రాలు, బంగారం, నగదు దోచుకునిపోయారు. దొంగతనం జరిగిన విషయం గుర్తించిన సుమిత్ అగర్వాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడిచేలోగానే నిందితులను పట్టేశారు. సుమిత్ అగర్వాల్ ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News