: పార్టీలు మారిన వారు కాలగర్భంలో కలిసిపోయారు: మాజీ ఎంపీ సుఖేందర్ రెడ్డి
పార్టీలు మారిన రాజకీయ నేతలు కాలగర్భంలో కలిసిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అసలు పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నానాటికీ దిగజారిపోతున్న నేపథ్యంలో తాను బీజేపీలో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన ఆయన, తరచూ పార్టీలు మారుతున్నవారిపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వసూళ్ల పాలనను కొనసాగిస్తున్నారని సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.