: భర్త వదిలేసిన మహిళలకు కూడా పింఛన్లు ఇవ్వాలి: ఎర్రబెల్లి
ప్రజలకు మేలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతానని... అదే కీడు చేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సహించనని తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డులకు అర్హులైన వారు ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారని... వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సంక్షేమ పథకాలను అందించడంలో రాజకీయ జోక్యం ఉండరాదని... అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథక ఫలాలు అందాలని అన్నారు. భర్త వదిలేసిన మహిళలకు కూడా పింఛన్లను అందించాలని డిమాండ్ చేశారు.