: 40 నిమిషాలు... 5 వేల మంది ఫాలోవర్లు...దటీజ్ పవన్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగునాట ఉన్న అభిమానానికి అంతులేదు. ఆయన గురించిన అప్ డేట్ దొరికితే దానిపై అమితాసక్తి చూపుతారు. ఆయన స్టామినాని రుజువు చేసే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. కొచ్చాడయాన్ విడుదల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ఖాతా తెరిచి అభిమానులకు సందేశాలు పంపడం, వారి వద్దనుంచి అభినందనలు అందుకోవడం చూసిన పవన్.. తాను కూడా అభిమానులకు మరింత చేరువ కావాలని భావించి, అధికారికంగా ట్విటర్ ఖాతా తెరిచాడు. పవన్ ఇలా ఖాతా తెరిచాడో లేదో ఆ విషయాన్ని అభిమానులు దానిని ఫేస్బుక్ లో షేర్ చేశారు. దీంతో అకౌంట్ ఓపెన్ చేసిన 40 నిమిషాల్లోనే 5 వేల మంది ఫాలోవర్లు చేరిపోయారు.

  • Loading...

More Telugu News