: నిజాం గొప్పరాజు...ఆంధ్రోళ్లు తొక్కేశారు: కేసీఆర్


హైదరాబాదును పరిపాలించిన నిజాం చాలా గొప్పరాజు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 75వ నుమాయిష్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు అన్నీ నిజాం నిర్మించినవేనని అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే గొప్పగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ స్థలాన్ని వారం రోజుల్లోగా సొసైటీకి అప్పగించనున్నామని ఆయన వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని ఆయన సొసైటీకి సూచించారు. నిజాం ప్రభువు ఎంత గొప్పవాడంటే రాజరికం పోయిన తరువాత గవర్నర్ గా ఉండగా ఎముకల ఆసుపత్రిని నిర్మించేందుకు డబ్బులిచ్చారని ఆయన కొనియాడారు. ఆంధ్రోళ్లు చరిత్రను బయటికి రాకుండా అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. నిజాం తమ రాజని, ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజాం సాగర్ నిర్మించిన గొప్ప రాజు నిజాం అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News