: ఈ-టోల్ విధానంతో 88 వేల కోట్ల రూపాయల ఆదా: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ గేట్ల స్థానంలో ప్రవేశపెట్టనున్న ఈ-టోల్ విధానం ద్వారా సుమారు 88 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టోల్ గేట్ల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతుండడంతో వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని అన్నారు. దీంతో ఈ-టోల్ గేట్ విధానం తీసుకురానున్నామని అన్నారు. కొత్త విధానం ద్వారా టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.