: మహిళల భద్రత కోసం 'హిమ్మత్'
దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంటరిగా వెళ్లాలంటే మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతారక్కడ. గతంలో జరిగిన అత్యాచార ఘటనలు వారిపై బాగానే ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో మహిళల భద్రత కోసం ఓ మొబైల్ యాప్ ను రూపొందించారు. దీనిపేరు 'హిమ్మత్'. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ఈ యాప్ ను ఆవిష్కరించారు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. 'హిమ్మత్' ప్రత్యేకత ఏమిటంటే... ఆపద సంభవించినప్పుడు ఇందులోని ఓ బటన్ ను నొక్కితే పోలీస్ కంట్రోల్ రూంకు, బంధుమిత్రులకు వెంటనే సమాచారం వెళుతుంది. అంతేగాదు, ఘటనకు సంబంధించి 30 సెకన్ల ఆడియో, వీడియో కూడా రికార్డవుతుంది.