: ఆ నలుగురినీ తెలంగాణలోనే ఉంచండి: కేంద్రానికి కేసీఆర్ లేఖ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, జయేష్ రంజన్, సోమేష్ కుమార్, రోనాల్డ్ రాస్ లను తమ రాష్ట్రంలోనే కొనసాగనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఒకవేళ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయించిన పక్షంలో... జీతభత్యాలు ఆంధ్రలోనే ఇస్తూ, డిప్యుటేషన్ పై తెలంగాణకు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. కాగా, పూనం మాలకొండయ్య టీపీఎస్సీ, మహిళా బిల్లు వంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, సోమేష్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News