: కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన వ్యోమగాములు


సంవత్సరాది ఒక్కసారే వస్తుంది. కానీ వారికి 16 సార్లు వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు 16 సార్లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గంటకు 28,163 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ స్పేస్ స్టేషన్ తిరుగుతుండటమే ఇందుకు కారణం. 24 గంటల వ్యవధిలో 16 సార్లు వారు రాత్రి, పగలు చూశారని నాసా తెలిపింది. కాగా, అంతరిక్షానికి చేరుకోవాల్సిన తదుపరి రవాణా నౌక కోసం వీరు వేచి చూస్తున్నారు. వీరికి కావాల్సిన ఆహార పదార్థాలు, సాంకేతిక పరికరాలతో కూడిన అంతరిక్ష నౌక ఈ నెల 6వ తేదీన నింగికి ఎగరనుంది.

  • Loading...

More Telugu News