: ట్విట్టర్ లో ప్రవేశించిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త ఏడాదిలో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ప్రవేశించారు. కొత్త సంవత్సరం తొలిరోజున తన పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఈ మేరకు "నూతన సంవత్సరం... ట్విట్టర్లో నాకు నూతన ఆరంభం" అంటూ దీదీ తొలి ట్వీట్ చేశారు. ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తన ఖాతాను ప్రారంభించగా, గంటలో 50 మంది అభిమానులు మమత ట్వీట్ కు స్పందించారు.