: 'అణు' సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్న దాయాదులు
భారత్, పాకిస్థాన్ తమ అణు కేంద్రాల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. నేడు ఢిల్లీ, ఇస్లామాబాద్ నగరాల్లోని దౌత్యాధికారుల మధ్య ఏకకాలంలో జాబితాల మార్పిడి జరిగింది. ఒకవేళ యుద్ధం సంభవిస్తే, ఒకరి అణు కేంద్రాలపై మరొకరు పొరబాటున కూడా దాడి చేయకుండా ఉండేందుకే వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మేరకు దాయాదుల మధ్య 1992 జనవరి 1న ఒప్పందం కుదిరింది. నేటితో కలిపి రెండు దేశాల మధ్య 24 మార్లు అణు సమాచార మార్పిడి జరిగింది.