: 32 వెబ్ సైట్లపై నిషేధం!


ఉగ్రవాద వ్యతిరేక దళం నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు 32 వెబ్ సైట్లను నిషేధించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చట్ట వ్యతిరేక సమాచారం కలిగి ఉన్నందునే ఈ వెబ్ సైట్లు నిషేధాన్ని ఎదుర్కోనున్నాయని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిల్లో ఇంటర్నెట్ ఆర్చీవ్, పేస్ట్ బిన్, సోర్స్ ఫోర్జ్ వంటి సైట్లున్నాయి. ఇదే సమయంలో వీబ్లీ, విమెయో, డైలీ మోషన్, గిట్ హబ్ లపై అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వెబ్ సైట్లను తక్షణం బ్లాక్ చేయాలని ఉగ్రవాద వ్యతిరేక దళం అదనపు డీజీపీ నవంబర్ 15న కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News