: గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్
సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారంగా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే పథకానికి మోక్షం కలిగింది. రూ.1300 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఈ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు.