: నాకు స్వార్థముంటే తిరుపతిలో రాజధాని నిర్మించేవాడిని: చంద్రబాబు


తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నమే పెద్ద నగరమని... అయినా, రాజధానికి తుళ్లూరు తప్ప మరే ప్రాంతం అనువుగా లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో తమ ఇంటి ముందే 10 వేల ఎకరాల అటవీ భూమి ఉందని... తనకు స్వార్థం ఉంటే అక్కడే రాజధాని నిర్మించేవాడినని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాజధాని ఇడుపులపాయకు వెళ్లేదని సెటైర్ విసిరారు. రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. తుళ్లూరు బహిరంగసభలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురి చేసే వారిని క్షమించమని హెచ్చరించారు. రైతులకు ఆదాయ మార్గాలను కూడా చూపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామ కంఠానికి పట్టాలు ఇస్తామని... గ్రామస్తులు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News