: భార్య రబ్రీదేవికి గులాబీ ఇచ్చిన లాలూ
గుండె ఆపరేషన్ చేయించుకున్న నాలుగు నెలల తరువాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈరోజు పాట్నా వచ్చారు. కొత్త సంవత్సరాన్ని తన నివాసంలో జరుపుకున్న ఆయన ఈ సందర్భంగా పలువురి సమక్షంలో భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి గులాబీ పువ్వు ఇచ్చారు. ఈ సమయంలో ఫొటో తీసేందుకు పలు కెమెరాలు పోటీపడ్డాయి. అనంతరం లాలూ మీడియాతో మాట్లాడుతూ, "ప్రస్తుత కాలంలో ప్రజలు ఆంగ్ల కాలెండర్లను అనుసరిస్తున్నారు. అందుకే పాట్నాలో కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదనుకున్నా" అని అన్నారు.