: 'సైకిల్' ఎక్కుతానంటున్న బైరెడ్డి!


రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళతానని అన్నారు. సీమను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని, చంద్రబాబును కోరతానని చెప్పారు. కాగా, బైరెడ్డి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News