: మాక్ డ్రిల్ లో ఉగ్రవాదులకు ముస్లిం టోపీలు... పోలీసులపై విమర్శలు
ఉగ్రవాదులు దాడిచేస్తే ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని పోలీసులు భావిస్తే, అది వారిపైనే విమర్శలు వచ్చేలా చేసింది. గుజరాత్ లోని సూరత్ పోలీసులు ఒకేసారి 10 చోట్ల మాక్ డ్రిల్ తలపెట్టారు. ఉగ్రవాదులు విరుచుకు పడ్డట్టు ప్రజలకు భ్రమ కల్పించారు. వీరి తలలపై ముస్లింలు వాడే తెల్ల టోపీలను ఉంచడం విమర్శలకు తావిచ్చింది. ముస్లింలు ఉగ్రవాదులు అనే అర్థం వచ్చేలా పోలీసులు వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. తాము ఒకేసారి పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించమని ఒక్కోచోట ఒక్కోరకంగా ఉగ్రవాదులు ఉంటారని, ఇలా జరిగి ఉండకూడదని సూరత్ డీఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు.